- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో బిడ్డా.. ‘దిశ’ కథనానికి పలువురి స్పందన
దిశ, ముధోల్ : కుబీర్ మండలం పల్సి గ్రామంలో నెలలు నిండని ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ ఆదివారం ఓ చోట వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వార్త దిశ ఈ పేపర్‌లో ప్రచురితమైన వెంటనే అన్ని గ్రూపుల్లో వైరల్ అయ్యింది. పలువురు దీనిని తమ మొబైల్ స్టేటస్‌లుగా పెట్టుకున్నారు. ఈ కథనాన్ని చూసిన పిల్లలు లేని ఓ జంట ఈ పాపని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి దిశ ముధోల్ ప్రతినిధికి ఫోన్ కాల్స్ రావడంతో ఇదే సమాచారం పల్సి సర్పంచ్ కవిత రాజుకు తెలియజేశారు.
ఆయన స్పందించి ప్రస్తుతం పాపకు సంబంధించి తల్లి గానీ, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు, అంగన్వాడి సిబ్బంది వద్ద సురక్షితంగా ఉంచారు. అయితే, పాపను తాము పెంచుకుంటామంటూ పదుల సంఖ్యలో కాల్స్ వచ్చినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఫార్మాలిటిస్ అన్ని పూర్తయ్యాక పోలీసులతో చర్చించి, పాప బాగోగుల విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని సర్పంచ్ కవిత రాజు చెప్పుకొచ్చారు.