ఉస్మానియా ఆస్పత్రిలోకి నీరు రావడంపై హెచ్ఆర్సీ సీరియస్

by Anukaran |   ( Updated:2020-07-16 07:25:19.0  )
ఉస్మానియా ఆస్పత్రిలోకి నీరు రావడంపై హెచ్ఆర్సీ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆస్పత్రిలోని పలు వార్డులకు నీళ్లు చేరిన ఘటనను మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై ఆగస్టు 21లోపు నివేదిక సమర్పించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌కు మానవ హక్కుల కమిషన్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌‌లో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆస్పత్రిలోని పలు వార్డులకు మోకాళ్లలోతు నీరు చేరడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యులు.. పేషంట్ల దగ్గరకు వెళ్లి చికిత్స చేసేందుకు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి అధికార యంత్రాంగం మొత్తం ఉస్మానియా ఆస్పత్రి పనుల్లో నిమగ్నమై నీళ్లను బయటకు పంపిస్తున్నారు.

Advertisement

Next Story