మ్యాజిక్ ఫిగర్ ఎంత?

by Shyam |   ( Updated:2021-03-18 22:23:38.0  )
మ్యాజిక్ ఫిగర్ ఎంత?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఏ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

రెండో ప్రాధాన్యత ఓట్లు ఇలా రావాలి..

– పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 1,83,167ను చేరుకోవాలంటే.. ఇంకా 72,327 ఓట్లు రావాలి. అలా అయితేనే పల్లాకు విజయం దక్కుతుంది.

– రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 83,290 వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవాలంటే.. ఇంకా 99,877 ఓట్లు అవసరం. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆ మేరకు వస్తేనే మల్లన్నను గెలుపు వరిస్తుంది.

– మూడో స్థానంలోని కోదండరామ్‌కు 70,072 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయనను గెలుపు వరించాలంటే..1,13095 ఓట్లు రావాల్సి ఉంది.

అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు. దీంతో అందరిని ఎలిమినేషన్ చేసిన తర్వాత ఇద్దరు మాత్రమే మిగిలితే అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇప్పటికే అందరి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారిలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed