ఇండియాలో ఎంత మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారంటే!

by vinod kumar |
ఇండియాలో ఎంత మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారంటే!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇప్పటివరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామనే విషయంపై కేంద్రం వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 17,82,16,384 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.

ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 13,90,05,990 మంది ఉండగా, సెకండ్ డోస్ తీసుకున్న వారు 3,92,10,394 మంది ఉన్నారు. తెలంగాణ విషయానికొస్తే ఇప్పటివరకు 54,78,674 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయగా.. తొలిడోస్ తీసుకున్నవారు 44,41,861 మంది ఉండగా, రెండో డోస్ తీసుకున్నవారు 10,36,813కి చేరుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 75,49,212 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, ఫస్ట్ డోస్ తీసుకున్నవారు 54,69,126 మంది ఉండగా, ఏపీలో సెకండ్ డోస్ తీసుకున్నవారు 20,80,086 మంది ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed