- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 13 శాతం మెజార్టీ ఎలా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉత్కంఠగా సాగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది అంతు చిక్కకుండా తయారైంది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ పోటీలో గెలుపు తమదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ సీఎం ఏ లెక్కన గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు? లోతుగా అధ్యయనం చేసిన తీరేంటీ? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ లో బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పని చేస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు పెద్ద ఎత్తున చేయించారు. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు నిఘా వర్గాలు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ సేకరించాయి. అన్నీ సర్వేలను క్రోడీకరించి పలుమార్లు రీ సర్వే కూడా చేయించారు.
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఏజెన్సీలే కాకుండా కేటీఆర్ కు సంబంధించిన స్పెషల్ టీమ్స్ కూడా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ సేకరించాయి. అయితే ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది? ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? అన్నదే మిస్టరీగా మారింది. ఇక్కడి ఓటరు మనోగతం ఏంటో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి నమ్మకమైన ఓ సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టుతో రూఢీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అతి ఎక్కువగా ఆదరించే ఆ సర్వే ఏజెన్సీ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకునే హుజురాబాద్ లో 13 శాతం టీఆర్‌ఎస్ ఆధిక్యతలో ఉందని చెప్పినట్టు సమాచారం.
ఈ సర్వేలో పెన్షన్లు తీసుకునే వర్గాలు, టీఆర్‌ఎస్ అభిమానులు, ప్రభుత్వంపై సానుకూలత ఎంత మేర ఉంది? ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారుల నుండి ఎలాంటి స్పందన ఉంది? దళితబంధు లబ్దిదారుల్లో ఉన్న సానుకూలత ప్రభావం ఎంత? అన్న విషయాలపై ప్రధానంగా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రత్యర్థి బలాబలాలు, ఓటర్లలో ఉన్న సానుకూలత ఎంత? క్రమక్రమంగా తగ్గుతుందా? లేక పెరుగుతుందా? హెచ్చు తగ్గుల శాతం ఎంత? అన్న వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. తటస్థంగా ఉన్న ఓటర్ల శాతాన్ని కూడా క్షేత్రస్థాయిలో సేకరించిన సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సీఎం హుజురాబాద్ ఫలితాలపై ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.