- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది గృహాల అమ్మకాల్లో క్షీణత
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 47 శాతం పడిపోనుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తెలిపింది. అలాగే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పూణె నగరాల్లో ఈ ఏడాది కొత్త గృహ విక్రయాలు 46 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని అనరాక్ వెల్లడించింది. 2020 ముగిసేందుకు ఇంకా 10 రోజులకు ముందు అమ్మకాలకు సంబంధించి డేటాను విడుదల చేసిన అనరాక్..ప్రధాన నగరాల్లో మొత్తం గృహాల అమ్మకాలు 1.38 లక్షల యూనిట్ల తగ్గిపోతుందని పేర్కొంది.
గతేడాది ఈ నగరాల్లో మొత్తం 2.61 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని అనరాక్ తెలిపింది. ఇక, కొత్త గృహాల విక్రయాలు గతేడాది 2.37 లక్షల యూనిట్లు నమోదవగా, ఈసారి 1.28 లక్షల యూనిట్లకే పరిమితమయ్యాయి. కరోనా ప్రభావం నుంచి రియల్ రంగం నెమ్మదిగా బయటపడుతోందని, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బలమైన పునరుద్ధరణ సంకేతాలు ఉన్నాయని అనరాక్ అభిప్రాయపడింది. ‘కరోనా వల్ల ఈ ఏడాది అన్ని రకాలు గాను రియల్టీ రంగం కుదేలైంది. ఈ పరిస్థితులను అధిగమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో పెరుగుతున్న అమ్మకాలు గృహ యజమానుల సెంటిమెంట్‌ను బలపరిచిందని’ అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి చెప్పారు. రియల్టర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు, బ్యాంకులు అందించే తక్కువ వడ్డీ రేట్ల పరిణామాలతో డిమాండ్ మరింత వేగవంతంగా ఉందని ఆయన వెల్లడించారు.