గువహతిలో డోర్ టు డోర్ టెస్టులు

by Shamantha N |
గువహతిలో డోర్ టు డోర్ టెస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు గువహతిలో వేగంగా పెరుగుతుండటంతో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నగరంలో ఇంటింటా టెస్టులు నిర్వహించే ప్రణాళికను అమలు చేయనుంది. గువహతి మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 2లో 3,000 టెస్టులు పూర్తిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రణాళిక వేసిందని మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోంలో తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టులు నిర్వహించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వార్డు తర్వాత మరిన్ని వార్డుల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగిస్తామని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ లక్ష్మణన్ వివరించారు. కరోనా పరీక్షల కోసం ప్రజలు నేరుగా తమ నమూనాలను సమర్పించే 31 సెంటర్‌లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed