గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

by Shyam |
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
X

దిశ, నల్లగొండ: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. మర్రిగూడం మండలం శివన్నగూడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్లపల్లి రఘుపతి కుమారుడు గ్యాస్ పొయ్యిపై పాలు పెట్టి బయటకు ఆడుకోడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పాలు పొంగి మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంటికి పక్కనే ఉన్న పశువుల కొట్టానికి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపారు.

Advertisement

Next Story