గ్యాస్ లీకై ఇళ్లు దగ్ధం..

by Sumithra |
gas leak fire accident
X

దిశ, పాలేరు: కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం గ్యాస్ లీకై ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన కందాల నాగన్న భార్య లక్ష్మి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఇంట్లో వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బీరువాలో దాచిన రూ.50 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, దుస్తులు అగ్నికి అహుతయ్యాయి.

చుట్టు పక్కల వారు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అగ్ని కిలలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కట్టుబట్టలు మాత్రమే మిగలడంతో రోడ్డున పడ్డారు. ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు.

Advertisement

Next Story

Most Viewed