బుధుడు సంచారం.. ఈ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్.. మీ రాశి ఉందా?

by Disha Web Desk 10 |
బుధుడు సంచారం.. ఈ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి.ప్రతి నెల బుధ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇలా సంచారం చేయడం వలన ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. అయితే, ఏప్రిల్‌ 19న బుధుడు, మీనరాశిలో సంచారం చేయబోతోంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మెర్క్యురీ మేధస్సు, కమ్యూనికేషన్ యొక్క సూచికగా పరిగణించబడుతుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి

ఈ సమయం సింహ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, మీరు మీ స్నేహితులతో భారీ లాభాలను పొందవచ్చు. ఇది మీ ఆదాయాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా చాలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

మిథున రాశి

ఈ సమయంలో మిథునరాశి వారికి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఫలితంగా, మీ కంపెనీలు కూడా భారీ లాభాలను ఆర్జించనున్నాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా, ఉద్యోగాలు చేసే వారు పై అధికారుల నుంచి సహాయం కూడా పొందవచ్చు. ఈ సమయంలో అన్ని రకాల పనులను సులభంగా పూర్తి చేస్తారు.

Next Story