Todays horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 30-07-2024)

by Prasanna |   ( Updated:2024-07-29 22:30:32.0  )
Todays horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 30-07-2024)
X

మేష రాశి : మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఒత్తిడి, టెన్షన్, జీవితంలోని కష్టాల నుండి ఈ రోజు విముక్తి పొందుతారు. ఎప్పటికీ సుఖంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అన్నింటినీ విడిచిపెట్టి, మీ జీవనశైలిని మార్చుకోవడానికి ఇది మంచి సమయం. ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు.

వృషభ రాశి: ఈ రోజు మీ ముందు మీకు నచ్చని పనులు జరుగుతున్నప్పుడు మీ ఓర్పుని కోల్పోకండి. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. క్రొత్త ప్రాజెక్టులు, వెంచర్లను మొదలు పెట్టడానికి ఇదే మంచిరోజు. మీ పనిని ఈ రోజు మీ బాస్ మెచ్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: వ్యాపార విషయాలలో మీ తండ్రి సలహాను తీసుకుంటారు. కొందరికి కుటుంబానికి కొత్త వ్యక్తి రావడంతో సంబరాలు చేసుకుంటారు. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఆహ్లాదకరమైన విషయాలతో ఆశ్చర్యపరుస్తారు.

కర్కాటక రాశి: కొత్త ఉద్యోగంలోకి మారడం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. మీ పరిచయాలను మరింతగా పెంచుకోవడంలో సహాయపడతాయి. ఆహారం కుటుంబ జీవితానికి ప్రాథమిక అవసరమని మార్చిపకండి. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవ జరిగే అవకాశం ఉంది.

సింహ రాశి : ఈ రోజు కొత్తవారు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కోపం మిమ్మల్ని ఆక్రమించకుండా మీరు ప్రయత్నించండి. ఈ అనవసరమైన ఆందోళనలు, భయాలు మీ శరీరంపై డిప్రెషన్ , చర్మ సమస్యల వంటి ఒత్తిడికి దారితీస్తాయి. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు తమ జీవిత భాగస్వామి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు.

కన్యా రాశి: మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొంటారు. మీ వ్యక్తిత్వం కారణంగా, మీరు చాలా మందిని కలుస్తారు మీ కోసం మీరు సమయం తీసుకోనందున మీరు నిరాశకు గురవుతారు.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెడుతుంది. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గ్రహాన్ని బట్టి ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: మీశక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనస్సును బలహీనపరుస్తుంది. మీలో దాగి ఉన్న బలాలను మీరు గ్రహించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు.

మీన రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు మీరు గణనీయమైన సంపదను కలిగి ఉంటారు, ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆహ్లాదకరమైన సాయంత్రం కోసం మీ స్నేహితులు మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానిస్తారు. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపండి.

Advertisement

Next Story

Most Viewed