Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |
Todays Horoscope :  ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారికి నేడు అనుకున్న పనులన్నీ పూర్తిగా నెరవేరవు. అలాగే ప్రతి పని లో ఆటంకాలు ఏర్పడుతాయి. విధ్యార్థులకు బాగుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : ఈ రాశి వారికి నేడు అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి. ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మిథున రాశి : ఈ రాశి వారు వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి బహుమతులు అందుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.చిన్న చిన్న పనులకోసం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వలన చిక్కుల్లో పడుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహ రాశి : ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలల్లో పాల్గొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

కన్యా రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. కానీ ఆఫీసులో మీ ప్రవర్తన కొంత మందికి నచ్చకపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : నేడు ఈ రాశి వారు అధికంగా ఖర్చు చేస్తారు. ఇది మీ కుటుంబంలో కలహాలకు కారణం అవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. నేడు ఈ రాశి వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రుణసదుపాయం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

ధనస్సు రాశి : విద్యార్థులు నేడు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది. వివాహాది శుభకార్యాలకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశిలోని వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

మకర రాశి : నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీర్ఘకాలిక వ్యాధుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వస్తుంది. నేడు ఈ రాశి వారికి ఉన్నత పదువుల్లో అవకాశం లభిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశిలోని వారు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వీరి సమస్యలన్నీ తీరి నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

మీన రాశి : చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండా మీరే ఇబ్బందులను సృష్టించుకొని, సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి ప్రవర్తన మీకు అంతగా నచ్చదు.



Next Story