Today's Horoscope :నేటి రాశిఫలాలు

by Disha Web Desk 8 |
Todays Horoscope  :నేటి రాశిఫలాలు
X

మేష రాశి : నేడు ఈ రాశివారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్ట్‌లు చేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది.

వృషభ రాశి : నేడు ఈ రాశివారు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా వసూలు కానీ మొడి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. రియలెస్టేట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు రావు.

మిథున రాశి : నేడు ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు, విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆనందంగా ఈరోజు మొత్తాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి :ఈరాశి వారి జీవితంలో నేడు అద్భుతమైన రోజు కానుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది.

సింహ రాశి :నేడు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది. రుణసదుపాయం అందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం వలన ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగంల లభించే అవకాశం ఉంది.

కన్యా రాశి : ఈ రాశికి ఈ రెండు మూఢాల వల్ల అనేక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ కొన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అసాధారణ లాభాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు పొందే అవకాశముంటుంది.

తుల రాశి :నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చిక రాశి : ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలుంటాయి.


ధనస్సు రాశి : ఈ రాశి వారు నేడు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. తెలియని వారి నుంచి నేడు మీరు ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

మకర రాశి : నేడు ఈ రాశిలోని వారు కొంత మంది తమ ప్రాణ స్నేహితులు లేదా, వ్యాపార వేత్తల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. ఎవరేనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీప్లాన్ లని పాడుచెయ్యాలని చూస్తారు. కనుక, మీ చుట్టుప్రక్కల ఏంజరుగుతోందో పరిశీలిస్తూ ఉండటం మంచిది.

కుంభ రాశి :ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది.


మీన రాశి :ఈరాశి వారు నేడు అధికంగా లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా రుణాలకోసం ప్రయత్నం చేస్తున్నారో, వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు



Next Story

Most Viewed