Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-03-07 18:45:29.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతో సఖ్యతగా వ్యవహరించవలెను. కోప ఆవేశాలకు దూరముగా ఉండవలెను. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండవలెను.

వృషభ రాశి : ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. ఆరోగ్య సమస్యలు రావచ్చు.


మిథున రాశి : సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. వ్యాపారస్తులు వారి వ్యాపారముకోసము ఇంటినుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్నిజాగ్రతగా భద్రపరుచుకోవాలి లేనిచో మీధనము దొంగిలించబడవచ్చు. మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. ఆదాయం బాగుంటుంది.

కర్కాటక రాశి : బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇకమీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోవడం మంచిది.

సింహ రాశి : సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్ వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు.

కన్యా రాశి : చాలా కాలంగా మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం బాగుంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎవరైనా మిమ్ముల్ని సమస్యలన్ని పరిష్కరించాలని కోరితే వాటిని పక్కన పెట్టడం మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

తుల రాశి : ఈ రాశివారు నేడు అనవసరమైన విషయాల గురించి ఆలోచిచకపోవడం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు ఈరాశి వారు బంధువులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృశ్చిక రాశి : త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు మీకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అత్యవసర పనుల వలన ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆదాయం బాగుంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఎవరైతే అంకిత భావంతో కష్టపడి పని చేస్తారో వారికి నేడు తమ కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు అవి కొన్ని లాభాలను తీసుకొస్తాయి. స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మకర రాశి : ప్రతీ సమస్యకు మీ చిరునవ్వే పరిష్కారం కాగలదు. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీప్రేమజీవితం బాగుంటుంది.మీరు మీ ప్రియమైనవారిని కూడా సంతోషంగా ఉంచుతారు. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.

కుంభ రాశి : ఈరోజు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మీన రాశి : ఈ రాశి మహిళలు నేడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగడం వలన కాస్త అసహనానికి లోను అవుతారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు విషయాలు మీకు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed