Horoscope Today, November 13, 2023: నేటి రాశి ఫలాలు

by Prasanna |   ( Updated:2023-11-13 01:51:33.0  )
Horoscope Today, November 13, 2023: నేటి రాశి ఫలాలు
X

మేష రాశి : ఈ రోజు ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. ఆంటే కాకుండా మీ గౌరవం కూడా పెరుగుతుంది. కొన్ని పనులు అకస్మాత్తుగా నిలిచిపోయే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురుకావొచ్చు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతారు.

వృషభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీ సోదరులతో ఏదైనా వివాదం ఉంటే, అది ఈరోజుతో ముగుస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు మెరుగైన అవకాశాలొస్తాయి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మిథున రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఈరోజు మీరు మీ పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఈ కారణంగా మీరు ఉపశమనం పొందగలరు. ఈరోజు, మీ కుటుంబ సభ్యుల ఆనందం కూడా పెరిగినట్లు కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. మీరు అనుకున్న పనులను చేయలేరు. వ్యాపారులకు ఇది మంచి సమయం. మీ ప్రేమ జీవితంలో కొత్త చిక్కులు వస్తాయి.

సింహ రాశి : ఈ రోజు ఈ రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఒక ఆశ్చర్యకరమైన పార్టీని ఇవ్వొచ్చు. కోపం తగ్గించుకోక పోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిధి రావడం వలన మీరు చేయాలనుకున్న పనులు చేయలేరు.

కన్యా రాశి: ఈరోజు మీ ఆఫీసులో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏదైనా రుణం ఇవ్వాలని ఆలోచిస్తుంటే, వాటిని వాయిదా వేసుకోవాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

తులా రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. మీరు పని చేసే ఆఫీసులో మీ పై అధికారులతో గొడవ పడతారు. దీని వల్ల పని కూడా చేయలేరు. కానీ ఆఫీసు మారాలనుకుంటే ఇది మంచి సమయం కాదు. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంట్లో వాళ్లతో గడపండి.

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.వ్యాపారులకు ఇది మంచి సమయం.ఈరోజు మీరు మీ స్నేహితుల్లో ఎవరిదైనా సహాయం కోరితే, నిరాశ చెందాల్సి వస్తుంది. మీ జీవనోపాధికి సంబంధించి విద్యా రంగంలో ప్రయత్నాలు చేసేవారు ఈరోజు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు.

ధనస్సు రాశి : ఈ రోజు ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు ఏకాగ్రతతో పాటు కష్టపడి విజయం సాధించాలి.మీ బంధువుల నుంచి కొంత ఆర్థిక సాయం పొందొచ్చు. మీ స్నేహితులతో కలిసి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు వ్యాపారులు మొదలు పెడతారు. ఈ రోజు డబ్బును బాగా ఖర్చు చేస్తారు. మీ ప్రేమ జీవితంలో కొత్త చిక్కులు వస్తాయి. దీని వల్ల విడిపోయే అవకాశం ఉంది. కొత్త పరిచయాల వల్ల లాభ పడతారు. ఈరోజు మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. మీ కుటుంబంలో అవివాహితులకు వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదురుకావొచ్చు. అయితే పెద్దల సహాయంతో వాటిని పరిష్కారిస్తారు. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో బయటికి వెళ్తారు.

మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారు చాలా కష్ట పడాలి అనుకున్న పనులు చేయడానికి. మొత్తానికి మీ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి, మీకు పెద్ద గొడవలు అవుతాయి. దీని వాళ్ళ మీ మూడ్ మొత్తం పాడవుతుంది. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. ఈ రోజు ఆదా చేసిన డబ్బే మిమ్మల్ని సమస్యల నుంచి బయట పడేస్తుంది.

Advertisement

Next Story