- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
మేష రాశి : ఈరోజు మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగవకాశం వస్తుంది. మీరు చేసిన ఓ పని మీకు పెద్దల నుంచి ప్రశంసలు, రివార్డ్‌లు తీసుకొచ్చి పెడుతుంది. కోర్టు విషయాలు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి :ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు. మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులు సమకూరుస్తారు. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
మిథున రాశి : ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చుపెట్టవలసిన అవసరంలేదు,మీకంటే ఇంట్లోపెద్దవారు మీకు ఆర్ధికంగా సహకారాలు అందిస్తారు. రోజు చివరలో ఒక పాత స్నేహితుడిని కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు మీ సమయాన్ని పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి కేటాయిస్తారు. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి : సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు సకా లంలో పూర్తవుతాయి. ఇంటా బయటా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అను కూలంగా ఉంటాయి.
సింహ రాశి : మీరు భావోద్వేగపరంగా ఈరోజు నిలకడగా ఉండలేరు. కనుక ఇతరులముందు, ఎలా ఉంటున్నాము, ఏం అంటున్నాము అని జాగ్రత్త వహించండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి.
కన్యా రాశి : ఈరోజు మీ పోటీతత్వమే మిమ్ముల్ని ఉన్నతస్థానంలో నిలబెడుతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీకు ఇష్టమైన పనులు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వైవాహిక బంధం బాగుంటుంద. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడినా నేడు మీకు సానుకూలంగానే ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
తుల రాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్ లు పెరుగుతాయి.
వృశ్చిక రాశి : ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు, మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చాతనయినంత ఎక్కువ కృషి చేస్తుంటారు.
ధనస్సు రాశి : ఈరోజు ఈరాశి వారు ధృడంగా ఉండటం మంచిది. ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం బాగుంటుంది. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపరస్తులు పెట్టుబడుల విషయంలో ఆలోచించడం ఉత్తమం.
మకర రాశి : ఈ రాశి వారు నేడు చాలా సంతోషంగా గడుపుతారు. సెక్యులేషన్ ద్వారా లాభాలు పొందుతారు. విద్యార్థులకు కలిసి వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువసేపు గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్‌గా ఉండబోతుంది.
కుంభ రాశి : విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు మీ భార్యకు ఇంటిపనులలో పనివత్తిడి తగ్గించడానికిగాను సహాయపడండి. అది మీకు, పని పంపకం, దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది.
మీన రాశి : వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో ఇతరుల కంటే ముందుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి ఉంటుంది. అయితే, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో తొందర పాటుతో మాట్లాడడం మంచిది కాదు.