- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today's Horoscope : ఈ రాశివారికి నేడు పట్టిందల్లా బంగారమే
మేష రాశి : గ్రహచలనం రిత్యా మీరు అనుకున్నది నేడు ఏదీ జరిగేలా లేదు. నేడు ఈ రాశి వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ లలో మదుపు చెయ్యాలి. మీ జీవిత భాగస్వామి మీతో నేడు చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థలుకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు మొత్తం ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది.
వృషభ రాశి :నేడు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీకు కొత్తగా ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీని వలన మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా బాగుంటుంది.
మిథున రాశి : ఎవరికైతే చాలా కాలంగా పరిష్కారం కాని భూ సమస్యలు ఉన్నాయో, అవి నేడు పరిష్కారం అవుతాయి. నేడు మీరు మీకు ఎంతో ఇష్టమైన వస్తువులను పొగొట్టుకునే అవకాశం ఉంది. అందువలన వాటికి దూరంగా ఉండటం మంచిది. మీకు సరైన సమయానికి మీ బంధువులు సపోర్టు నిచ్చి ఆర్థిక సమస్యల నుంచి బయటపడగొడుతారు. నేడు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి : చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యహారంలో మీస్వలాభం కూడా చూసుకొండి.ఎలాగూ వారు మీగురించి ఆలోచించరు. మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం, ఇంట్లో టెన్షన్ మూడ్ ని తెస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. చిన్న వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సింహ రాశి : చిన్నవాటికి కూడా, మీరు చిరాకు పడిపోతారు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లేడే టప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. రుణప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది.
కన్యా రాశి : ఈ రాశి వారు నేడు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి కుదుట పడుతుంది.ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అఅవకాశం ఉంది. డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కుటుంబసభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చును. అందువలన మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఒత్తిడిని, ఇబ్బందిని కలిగిస్తుంది.
తుల రాశి : ఈ రాశి వ్యాపారస్తులు నేడు నష్టాలను చవిచూస్తారు. అంతే కాకుండా వ్యాపారాభివృద్ధి కోసం ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ బాధ్యతలు ఆందోళనను పెంచేలా ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కానీ స్నేహితుల సహాకారంతో వాటన్నింటిని అధిగమించుతారు. ఈరోజు ఎవరైతే చాలా కాలంగా వారసత్వ ఆస్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. నేడు భారీ భూ వ్యవహారాలనుడీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఎవరైతే తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది.
ధనస్సు రాశి : ఈరోజు మీరు చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. చాలా కాలం తర్వాత ఫ్రీ సమయం దొరకడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.ఆఫీసులో సహా ఉద్యోగులతో వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అవి మీకు లాభదాయకంగా ఉంటాయి.
మకర రాశి :మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, అలాగే అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. ఇంటిపనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజును మీరు నేడు గడుపుతారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేసినా అందులో అధిక ప్రయోజనాలు పొందుతారు.సామాజిక కార్యక్రమాల్లో, శుభ కార్యల్లో పాల్గొనే వారు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. ఉద్యోగస్తులు ఈరోజు తమ కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. తెలియకుండా చేసిన తప్పుల వలన ఉన్నతాధికారులు మీపై ఆగ్రహానికి గురి అవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
మీన రాశి : ఎవరైతే ఈ రాశి వారు ట్రేడు రంగంలో ఉన్నారో వారికి సాధారణంగా ఉంటుంది. మీరు ఎవరిదగ్గరైనా అప్పుతీసుకొని ఉంటే దాన్ని తిరిగి ఇచ్చేయాలి లేకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. నేడు ఉద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. నేడు ఆనందంగా గడుపుతారు
- Tags
- Today Horoscope