Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by samatah |   ( Updated:2023-05-27 04:40:04.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వ్యాపారస్తులు నేడు నష్టాలను చవిచూస్తారు. అంతే కాకుండా వ్యాపారాభివృద్ధి కోసం ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ బాధ్యతలు ఆందోళనను పెంచేలా ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కానీ స్నేహితుల సహాకారంతో వాటన్నింటిని అధిగమించుతారు. ఈరోజు ఎవరైతే చాలా కాలంగా వారసత్వ ఆస్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి : ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకిదెఇ మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. ఈరోజు మీకుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి,లేనిచో అనవసర తగాదాలు,గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది.

మిథున రాశి : ఈ రాశి వారు నేడు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి కుదుట పడుతుంది.ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అఅవకాశం ఉంది. డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కుటుంబసభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చును. అందువలన మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఒత్తిడిని, ఇబ్బందిని కలిగిస్తుంది.

కర్కాటక రాశి : ఎవరైతే ఇతరుల నుంచి అప్పు తీసుకున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా తిరిగి చెల్లించవలసి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి నీరసపరుస్తుంది. ఈరోజు మీకు ఓ శుభవార్త అందే అవకాశం ఉంది. అది మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషంలో ముచెత్తుతుంది. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే.

సింహ రాశి : ఈరోజు ఈ రాశి వారు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు.మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. ఈరోజు మీరేమైనా సలహా ఇస్తే, మీరుకూడా అలాగే సలహా తీసుకునే లాగ ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. మీరు ఎక్కవ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు.అయినప్పటికీ,మీరు సాయంత్రము వేళ సమయము ఎంతముఖ్యమైనదో తెలుసుకుంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.

కన్యా రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు.కావున మీరు మీకు నమ్మకమైనవారిని సంప్రదించండి. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి.ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి, అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పంద ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి : రాశి :ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మాత్తుగా అందే ఓ సమాచారం మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషంతో ముంచెత్తుతుంది. సహాద్యోగులు, సీనియర్ల నుంచి పూర్తి సహాకారం అందడంతో ఆఫీసులో పని త్వరగా పూర్తై సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతంది. ముఖ్యమైన పనులన్నీ త్వరగా నెరవేరుతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి వృత్తి వ్యాపారల్లో కలిసి వస్తుంది. ఈరోజు మీరు మంచి ఫలితాలు పొందుతారు. అందువలన ఏకాగ్రతతో పని చేయడం మంచిది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లేడే ముందు జ్రాత్తగా మాట్లాడాలి లేపోతే అనవసరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మకర రాశి :రోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు నిర్ణిత సమయంలో పూర్తి కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. రోజంతా ఆనందంగా గడుపుతారు.

కుంభరాశి :వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్ధికంగా నష్టపోతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రుణసదుపాయం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీన రాశి :మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది.

Advertisement

Next Story