నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

by samatah |   ( Updated:2023-03-12 03:21:16.0  )
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
X

మేష రాశి : ఈ రాశివారికి పరపతి గల వ్యక్తుల నుంచి మంచి ప్రోత్సాహం అందుతుంది. ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో అలాంటి వారు ఎక్కడి నుంచైనా సమయానికి ధనం చేతికంది, సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలకు ఈరోజు కలిసి వస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభ రాశి : మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఈ రోజు మీకు పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థిక సమస్యలన్నీ క్షణంలో తీరిపోతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. నేడు మీరు మీ దగ్గరి వారితో గొడవ పడే అవకాశం ఉంది. దాని వల్ల రోజు ఎండింగ్‌లో కాస్త బాధకులోనయ్యే అవకాశం ఉంది.

మిథున రాశి : చాలా కాలంగా ఎవరైతే ఆర్థికసమస్యలతో సతమతం అవుతున్నారో వారి ఈరోజు విముక్తి పొందుతారు. మీ బంధువుల రాక మీకు చాలా సంతోషాన్ని తెస్తుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీసు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అవి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

కర్కాటక రాశి : ఈ రాశిలో ఉన్న వారు తమ అత్తామామల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఓ సమాచారం మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషానికి గురి చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో మంచి పేరు సంపాదించుకుంటారు. విద్యార్థులకు కష్టపడితే కానీ ఫలితం దక్కదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

సింహ రాశి : గ్రహరీత్యా మీరు అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉంది.అది మీకు కాస్త ఒత్తిడిని పెంచుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఓ వ్యక్తి మిమ్ముల్ని పొగడ్తలతో ముచ్చెత్తుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడటం అవసరం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజు.

కన్యా రాశి : రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

తుల రాశి : ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో తిప్పట ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి :ఈ రోజు మీరుచేపట్టిన ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

ధనస్సు రాశి :ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు నుంచి రిలీఫ్ పొందబోతున్నారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఏదైనా ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీ వైవాహిక బంధంలో కలతలు ఏర్పడవచ్చును. ఆర్థికంగా బాగుటుంది. కానీ అనవసర ఖర్చులు పెరిగిపోతాయి.

మకర రాశి :ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగానే సాగిపోతుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు.

కుంభ రాశి : సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. బీమా సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

మీన రాశి : ఈ రాశి నిరుద్యోగులకు కలసివస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నేడు మీరు మీజీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Also Read: Telugu Panchangam 12 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story

Most Viewed