నేటి రాశిఫలాలు : ఈ రాశి భార్య,భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం

by samatah |   ( Updated:2023-02-23 18:45:43.0  )
నేటి రాశిఫలాలు : ఈ రాశి భార్య,భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం
X

మేషరాశి : స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు ఈ రోజు నష్టాలను చవి చూడక తప్పదు. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆఫీసులో చాలా ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి : ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. ధూమపానం,మద్యపానము మీద అనవసరముగా ఖర్చుపెట్టటము మానుకోండి.లేనిచో ఇదిమీకు అనారోగ్యముమాత్రమేకాదు,మీ ఆర్ధికారిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. మీవ్యక్తిగత జీవనంతోబాటు, కొంచెం సమాజ ధార్మిక సేవకూడా చెయ్యండి. అది మీకు, మానసిక ప్రశాంతతనుకలిగిస్తుంది. అదికూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మీ నిత్య వృత్తులకు భంగం కలిగించదు. మీరు ఈ రెండింటిపట్ల తగిన శ్రద్ధ చూపాలి.

మిథున రాశి :ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. మీరు వివాహము అయినవారుఅయితే మీసంతానముపట్ల తగిన శ్రద్ద తీసుకోండి,ఏందుకంటె వారు అనారోగ్యము బారినపడే అవకాశము ఉన్నది.దీనివలన మీరు వారి ఆరోగ్యముకొరకు డబ్బును ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఈ రోజు మీకు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. మీ వైవాహిక జీవితం కూడా మీరు ఊహించని విధంగా మారుతుంది.

కర్కాటక రాశి :ఆర్థికంగా కలిసి వస్తుంది. బంధువులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అనుకోని వార్త పిల్లలనుండి వచ్చి సంతోషపరుస్తుంది. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన సంతోషంగా గడుపుతారు. భాగ స్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.

సింహ రాశి : నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.ఈ రోజు మీ పాత మిత్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి.

కన్యారాశి : ఒత్తిడి మీకు, చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఖాళీ సమయంలో పుస్తకపటనం చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉన్నతాధికారుల ముందు ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం మంచిది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

తుల రాశి :ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గృహ నిర్మాణం దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాల ద్వారా కార్య సాఫల్యం ఉంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు ఈ వారం ఊహించని అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి : ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. బిల్లు బకాయలన్నీ చెల్లిస్తారు. ఆఫీసుల్లో రివార్డులు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఓ మంచి సలహా మీ మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. ఈ రోజు మీ భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. కొందరు ఆకస్మికంగా ఆఫీసుకు సెలవు పెట్టే పరిస్థితి ఎదురుకావచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

ధనస్సురాశి : చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో చిన్న పాటి గొడివలు కూడా పెద్దగా మారి మిమ్ముల్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తాయి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు ప్రశాంతత కోసం పార్క్‌లకు వెళ్లి సమయం గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఇరుగు పొరుగు మాటలు భార్యభర్తల మధ్య గొడవలు రాజేసే అవకాశం ఉంది.

మకర రాశి : ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మొత్తం చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీకు డబ్బు విలువ గురించి తెలిసి వస్తుంది, అందు వలన మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందన్నారు. మీ భవిష్యత్తు కోసం చాలా కష్టపడుతారు. మీరు ఈరోజు హాజరుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు కొత్త మార్గాలను చూపిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి :ఈ రోజు ఎవరైతే, జూదంలోనూ,బెట్టింగ్లోను పెడతారో వారుఈరోజు నష్టపోకతప్పదు.కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈరోజు మీకు సంబంధించిన ఏ రహస్యాన్ని బయటపెట్ట కూడదు. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి :మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.

Advertisement

Next Story