బుధుడి తిరోగమనం .. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

by Jakkula Samataha |
బుధుడి తిరోగమనం .. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!
X

దిశ, ఫీచర్స్ : నాలుగు రాశుల వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెల 19 నుంచి బుధుడు తిరోగమనం చేయనున్నారు. దీంతో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. ప్రస్తుతం సింహ రాశిలో ప్రత్యేక్ష మార్గంలో ఉన్న బుధుడు ఆగస్టు5 శ్రావణ మాసం నుంచి తిరోగమనం చేయనున్నారు. కాగా, దీని వలన ఏ రాశి వారికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

సింహ రాశి : బుధుడి తిరోగమనం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి : ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పూర్తి కాకుండా పోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు అందుకుంటారు.

కన్య రాశి : ఈ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు, నిరుద్యోగులకు కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వలన చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. బిజినెస్ ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయం. వివాహం కాని వారికి వివాహం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

( నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకే ఇవ్వబడినది దిశ దీనిని ధృవీకరించలేదు)


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed