- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే నెలలో రెండు యోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్యశాస్త్రం ద్వారా మన భవిష్యత్తు ఎలా ఉందో, మన అదృష్ట,దురదృష్టాల గురించి తెలుసుకోవచ్చు. ఇక పండితులు జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి మన రాశి ఎలా ఉంది, మన పై ఏ గ్రహం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, గ్రహసంచారం వలన ఏ రాశి వారికి కలిసివస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తారు.
అయితే గ్రహాల సంచారానికి ఫిబ్రవరి నెల ప్రత్యేకమైనదంట. ఈ నెల1న బుధుడు, మకరరాశికి, ఫిబ్రవరి 5న కుజుడు మకరరాశికి, 12న శుక్రుడు మకరరాశికి, 13న సూర్యదేవుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాయి.దీనివల్ల బుధాదిత్య రాజయోగంతోపాటు ఆదిత్య మంగళ యోగం ఏర్పడతుంది. దీని కారణంగా మూడు రాశులకు అదృష్టమే కాకుండా పట్టిందల్లా బంగారే కానున్నదంట.అవి ఏ రాశులో ఇప్పుడు చూద్దాం.
1. సింహ రాశి : గ్రహాల సంచారం వలన ఈ రాశికి ఈ నెల ఏ పని చేసినా అందులో విజయమే తప్ప అపజయం ఉండదంట. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారంట. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపరస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి ఈ గ్రహసంచారం వలన మంచి లాభాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు పండితులు.
2. కన్యారాశి : ఈ రాశి వారు గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందంట. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు సంబంధిత వ్యవహారం వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువ. అదే విధంగా, బ్యాకర్లకు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తుంది.
3. తుల రాశి : ఈ రాశి వారు ఆత్మ విశ్వాసంతో పని చేస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. చేసే ప్రతీ పనిలో విజయం వీరిదే అవుతుంది.ముఖ్యమైన పనులు చేయడానికి ఈ రాశి వారికి ఈ నెల కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.