- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shani : 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా, దీనిని కీడు గ్రహంగా చెబుతుంటారు. ఇది సంచారం చేసిన ప్రతీ సారి కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉండగా.. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం, కుంభరాశిని నుంచి మీనరాశిలోకి ప్రవేశించనుంది. అయితే, ఆ రోజున హోలీ పండుగను కూడా జరుపుకోనున్నారు. ఈ ప్రభావం రెండు రాశుల వారి పైన పడనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీరు పని చేస్తున్న ఆఫీసులో జీతంతో పాటు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు పని చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే, మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. అలాగే, తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగ ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికీ అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, ఈ సమయం బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే, ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగొచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికీ ఈ సమయం కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.