కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ మూడు రాశుల వారు కష్టాల్లో ఉన్నట్లే!

by Jakkula Samataha |
కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ మూడు రాశుల వారు కష్టాల్లో ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, నక్షత్రాల్లోకి మారడం కామన్. దీని వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల వలన కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురు అవుతుంటాయి. కాగా, జూలై23 నుంచి కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు. దీని వలన విష యోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారు సమస్యలు ఎదుర్కోనున్నారు.

కుంభ రాశిలో శని తిరోగమన దశ సంచరించడం, అలాగే చంద్రుడు కూడా కుంభ రాశిలోకే ప్రవేశించి రెండున్నర రోజుల పాటు సంచరించడం వలన ఈ యోగం ఏర్పడుతుంది. కాగా, ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి : ఈ రాశివారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్వాదాలకు వెళ్లకపోవడమే మంచిది. మీ శత్రువుల నుంచి మీకు సమస్యలు ఎదురు అవుతాయి. ఇంట్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అప్పులు పెరిగిపోతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు. ఆఫీసుల్లో కూడా మనస్పర్థలు రావడం వలన జాబ్ పోయే అవకాశం ఉంది. శత్రువుల వలన అనేక అడ్డంకులు ఎదురు అవుతాయి. కోపాన్ని అధిగమించు కోవడం మంచిది. మీరు చేసే చిన్న పొరపాటే మీకు పెను ప్రమాదాన్ని తెస్తుంది.

మీన రాశి : విష యోగం వలన మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుంది. అవసరానికి మించి అప్పు చేయడం మంచిది కాదు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Advertisement

Next Story