- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ ఎన్జీఓగా హోప్ ఫౌండేషన్.. ప్రశంస పత్రం అందజేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
X
దిశ, శేరిలింగంపల్లి: సేవారంగంలో తనదైన రీతిలో సేవలు అందజేస్తున్న హోప్ ఫౌండేషన్ ఉత్తమ ఎన్జీఓగా ఎన్నికైంది. స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఉత్తమ ఎన్జీఓలను ఎంపిక చేసి అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరానికి గాను హోప్ ఫౌండేషన్ ఉత్తమ ఎన్జీఓగా ఎన్నికైనట్లు చందానగర్ సర్కిల్ 21 వైద్యాధికారి కార్తీక్ తెలిపారు. శుక్రవారం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ కుమార్ ను శాలువాతో సన్మానించి ప్రశంసపత్రం అందచేశారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందజేస్తున్న హోప్ ఫౌండేషన్ సేవారంగంలో ముందువరుసలో ఉందని, అపదలో ఉన్నవారికి అండగా ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు డాక్టర్ కార్తీక్. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు శాంతిభూషణ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డితో పాటు చందానగర్ సర్కిల్ 21 సిబ్బంది గంగిరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story