- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తూర్పుగోదావరిలో హనీ ట్రాప్ మర్డర్
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో హనీట్రాప్ మర్డర్ కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణతో అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌కు భూ తగాదాలు ఉన్నాయి. దీంతో రామకృష్ణను హతమార్చాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. దీనికి ఓ యువతిని ఎరగా వేశాడు. గతేడాది డిసెంబర్ 8న యువతి ద్వారా రామకృష్ణను కాకినాడ రప్పించాడు. ప్లాన్ ప్రకారం రామకృష్ణను హతమార్చి, మృతదేహాన్ని అరట్లకట్ట సమీపంలోని పంట కాల్వలో పడేసి, పరారయ్యాడు. డిసెంబర్ 8 నుంచి రామకృష్ణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేసిన పోలీసులు రామకృష్ణ కాల్‌డేటా ఆధారంగా యువతిని, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న్టటు తెలిపారు.