కిడ్నీల్లో రాళ్ల సమస్యకు చెక్ పెట్టండిలా!

by sudharani |   ( Updated:2021-06-04 04:28:33.0  )
కిడ్నీల్లో రాళ్ల సమస్యకు చెక్ పెట్టండిలా!
X

దిశ, వెబ్‌డెస్క్: మనకు ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి శరీరంలోని వ్యర్థాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోతే ఆరోగ్యంగా దెబ్బతింటుంది. సాధారణంగా కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..

కిడ్నీల్లో రాళ్లు వచ్చినప్పుడు మూత్ర విసర్జన కూడా సరిగా చేయలేరు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లను నివారించేందుకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. గంటకు కనీసం గ్లాస్ నీళ్ళు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల రక్షణకు వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇక మొలకెత్తిన విత్తనాలు కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలో సహయపడతాయి. 8-12 గంటలు నానబెట్టిన విత్తనాలలో కొద్దిగా ఇంగువ లేద ఆసాఫోటిడాతో ఉడకబెట్టి తీసుకొండి.

స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ న్యూటియంట్స్, యాంటీఇన్‌ప్లమేటరి క్వాలిటీస్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకతను పెంచుతుంది. అదేవిధంగా ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని ప్రతిరోజు మూడుసార్లు తీసుకుంటే రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయ నీళ్లు, దానిమ్మ రసాన్ని తరచూ తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో ఎసిటిక్ ఆమ్లంగా మారుతోంది. ఇది కాల్షియం ఆక్సలేట్, ఇతర ఖనిజాల ద్వారా ఏర్పడే రాళ్లను విచ్ఛిన్న చేస్తుంది. భోజనం చేసే ఆరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed