- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల ఫౌండేషన్ సేవలు అద్భుతం: హోంమంత్రి
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో వలస కూలీలు, పేదలకు సేవలందించిన ఉప్పల ఫౌండేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గురువారం హోంమంత్రిని లక్డీకాపూల్‌లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, లాక్‌డౌన్ విధించిన నాటి నుండి ఉప్పల ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. నిత్యం 2వేలమందికి అన్నదానం, నిత్యావసరాల పంపిణీతో పాటు జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం హోంమంత్రి ఆఫీస్‌లోని సిబ్బందికి కరోనా సేఫ్ గార్డ్, శానిటైజర్, గ్లోవ్స్, మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ కరోనా కిట్‌ను పరిశీలించి ప్రశంసించారు. ఉప్పల ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను మెచ్చుకున్నారు. సామాజిక బాధ్యతగా సేవాభావంతో ఎంతోమంది ఆకలి తీర్చడం గొప్ప విషయమంటూ శ్రీనివాస్‌ను అభినందించారు.