బక్రీద్ పండుగపై హోంమంత్రి సమీక్ష

by Shyam |
బక్రీద్ పండుగపై హోంమంత్రి సమీక్ష
X

దిశ, క్రైమ్‌బ్యూరో: బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని హోం మంత్రి మహమూద్ అలీ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బక్రీద్ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 1న బక్రీద్ పండుగ నిర్వహణలో ముస్లీం సోదరులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.

వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ.. ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలన్నారు. తరుచూ చేతులు శుభ్రంగా కడ్డుక్కోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం, తరుచూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జంతువుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలను, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed