మహిళలకు 33శాతం రిజర్వేషన్లు : అమిత్ షా

by Shamantha N |
Home Minister Amit Shah
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో హామీలను గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌ను బంగారు బెంగాల్ చేస్తామన్నారు. రాబోయే ఎన్నికలను ఉద్దేశించి తమ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలకు, టీఎంసీ సిండికేట్లకు మధ్య జరిగే పోరాటమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపడుతున్న పరివర్తన్ యాత్ర చివరి విడతను దక్షిణ 24 పరగణాలు జిల్లాలో అమిత్ షా గురువారం ప్రారంభించారు. నంఖానా గ్రామంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. జై శ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రభుత్వోద్యోగులకు ఏడో వేతన కమిషన్ ప్రయోజనాలను అందిస్తామని హామీనిచ్చారు. అంఫాన్ తుఫాన్ సహాయక నిధుల పంపిణీలో అవినీతి చోటుచేసుకుందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని తొలగించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం పార్టీ లక్ష్యం కాదని, కేవలం రాష్ట్రంలో మార్పు కోసమే పనిచేస్తామని వివరించారు. బెంగాల్ పరిస్థితులను మెరుగుపరచడమే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను మార్చాలని తలుస్తున్నాట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed