హోంగార్డును బలి తీసుకున్న గుండెపోటు..

by Sumithra |
హోంగార్డును బలి తీసుకున్న గుండెపోటు..
X

దిశ, తుంగతుర్తి : అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హోంగార్డు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. దేవునిగుట్టకు చెందిన గూగులోతు పకీరా(45) భువనగిరి పట్టణంలో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పని ఉండి 2 రోజుల కిందట ఆయన స్వగ్రామానికి వచ్చారు. వ్యవసాయ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పకీరా మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story