యువతిని నాలుగు గంటలపాటు రేప్ చేసిన హీరో.. కేసు ఫైల్

by Anukaran |
Hollywood Actor Armie Hammer
X

దిశ, సినిమా : హాలీవుడ్ హీరో ఆర్మీ హ్యామర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎఫీ అనే 24 ఏళ్ల మహిళ గురువారం ప్రెస్ మీట్‌లో ఇందుకు సంబంధించిన నిజాలు వెల్లడించగా.. ఫిబ్రవరి 3 నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. హ్యామర్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా 2016లో మీట్ అయిన ఎఫీ.. 2020 వరకు తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పింది. హ్యామర్ తనను మెంటల్‌గా, ఎమోషనల్‌గా, సెక్సువల్‌గా వేధించేవాడని వాపోయింది.

ఏప్రిల్ 24, 2017న లాస్ ఏంజిల్స్‌లో తనపై నాలుగు గంటలపాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, పదే పదే తలను గోడకు కొట్టేవాడని ఈ క్రమంలో తలకు, ముఖానికి గాయాలయ్యాయని తెలిపింది. వీటన్నింటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ లాయర్‌తో కలిసి ప్రెస్‌తో మాట్లాడాడు ఆర్మీ హ్యామర్. ఎఫీతో పాటు ఇతర సెక్సువల్ పార్ట్‌నర్స్ అందరితోనూ తన రిలేషన్స్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగాయన్నాడు. ముందుగా చర్చించుకున్నాకే రిలేషన్‌షిప్‌లోకి వచ్చామని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed