- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 కోట్ల అమ్మకాల మైలురాయి దాటిన హోండా ఇండియా!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా సోమవారం దేశీయ మార్కెట్లో 5 కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్టు వెల్లడించింది. 2001లో కంపెనీ యాక్టివా స్కూటర్‌లో భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటినుంచి 11 ఏళ్లలో మొదటి కోటిమంది వినియోగదారులను సంపాదించినట్టు, ఆ తర్వాత 3 రెట్ల వృద్ధితో కేవలం మూడేళ్లలో 2 కోట్ల అమ్మకాల మార్కును చేరుకుందని కంపెనీ వివరించింది. మొదటి రెండున్నర కోట్ల అమ్మకాలకు 16 ఏళ్ల సమయం పట్టిందని, అనంతరం రెండున్నర కోట్ల అమ్మకాలను సాధించేందుకు ఐదేళ్లే సాధించినట్టు హోండా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
‘రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్లో కొనసాగడం గర్వంగా ఉంది. హోండా బ్రాండ్‌ని 5 కోట్ల మంది వినియోగదారులకు చేర్చడం, వారి విశ్వాసాన్ని పొందడం సంతోషంగా ఉంది. వ్యాపార భాగస్వాములు, వాటాదారులతో సహా వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. నాణ్యత కలిగిన ఉత్పత్తులు, మెరుగైన అమ్మకాల ద్వారా మరిన్ని లక్ష్యాలను చేరుకోగలమని’ హోండా ఇండియా అధ్యక్షుడు, సీఈఓ అతుషి ఒగాటా చెప్పారు. కాగా, 2001లో హోండా సంస్థ తన మొదటి కర్మాగారాన్ని హర్యానాలోని మానెసర్‌లో ఉత్పత్తిని చేపట్టింది. తర్వాతి ఏడాది 2002లో భారత్ నుంచి ఎగుమతులను ప్రారంభించింది. 2004లో 150సీసీ యూనికార్న్‌తో ద్వారా మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది.