- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Government Jobs : మూడేళ్ల కనిష్టానికి ఉద్యోగ నియామకాలు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థికవ్యవస్థ కుదేలవడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతం క్షీణించగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 21 శాతం పడిపోయినట్టు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 87,243 మందిని నియమించగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 1,19,000 మందిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు 3,89,052 మందిని నియమించగా, ఇది అంతకుముందు కాలంతో పోలిస్తే 1,07,000 తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికవ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం కారణంగానే ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం.. మే 16తో ముగిసిన వారంలో భారత నిరుద్యోగ రేటు 14.45 శాతానికి పెరిగింది. అంతకుముందు మే నెల మొదటివారంలో ఇది 8.67 శాతంగా ఉంది.