అసోం 15వ సీఎంగా హిమంత ప్రమాణం

by Shamantha N |
అసోం 15వ సీఎంగా హిమంత ప్రమాణం
X

గువహతి: అసోం 15వ సీఎంగా నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ కూటమి(ఎన్ఈడీఏ) కన్వినర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణం చేశారు. గువహతిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో, గవర్నర్‌ జగదీశ్ ముఖి చేతులమీదుగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర నేతలు హాజరయ్యారు. హిమంతతోపాటు కేబినెట్‌ మంత్రులుగా మరో 13 మంది సభ్యులూ ప్రమాణం చేశారు. ఇందులో అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఆయన నేతృత్వంలోని 17మందితో కూడిన గత కేబెనెట్ నుంచి ఏడుగురు సభ్యులు అలాగే ఉన్నారు.

ఎన్నార్సీ జాబితా పున:ధృవీకరిస్తాం

సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) జాబితాను పున:ధృవీకరిస్తుందని వెల్లడించారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌ వ్యతిరేక చట్టాలను తీసుకురావడంతోపాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలకూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. కరోనా కట్టడిపై చర్చించేందుకు మంగళవారం కేబినెట్ మీటింగ్ జరపనున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed