రైతుకు మద్దతుగా టాలీవుడ్ టీజర్

by Shyam |
రైతుకు మద్దతుగా టాలీవుడ్ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నో ఫార్మర్.. నో ఫుడ్’ స్టోరీ లైన్‌తో హిమ మీడియా వర్క్స్ అండ్ విలేజ్ ఫిల్మ్ కార్పొరేషన్ తొలి ప్రాజెక్టును నిర్మిస్తోంది. రైతు ఆందోళనను పురస్కరించుకుని వారికి మద్దతు పలుకుతూ టీజర్‌ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ‘మేమున్నది కేవలం మీవల్లే.. మీ కోసం నిలబడతాం.. ఎల్లప్పుడూ మీతో ఉంటాం’ అంటూ రైతు ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ రిలీజైన టీజర్‌లో రైతు గొప్పతనాన్ని వివరించారు. ‘ఈ ప్రపంచంలో ఎవరికీ తల వంచకుండా, ఎవరికీ భయపడకుండా ఉండే ఉద్యోగమేంటో తెలుసా? వ్యవసాయం’ అంటూ రైతుగా నటించిన శుభలేఖ సుధాకర్ వాయిస్‌ ఆడియన్స్‌ను ఉద్వేగానికి లోనయ్యేలా చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed