అశ్లీల వీడియోలు తొలగించండి..

by Shamantha N |

రోజురోజుకూ పెరిగిపోతున్నఅశ్లీల వీడియోల కల్చర్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల మీద చేస్తున్నవికృత చేష్టలు,మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మళ్లీ ఆదేశించింది.ఈ విషయంలో గూగుల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సహా ఇంటర్నెట్‌ ఇంటర్మీడియరీ సంస్థలతో చర్చలు జరపాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్నిఆదేశించింది.సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.2015లో హైదరాబాద్‌కు చెందిన ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థ గత సీజేఐకు రాసిన లేఖను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది.

Advertisement

Next Story