ఉస్మానియా ఆస్పత్రి భవనం వారసత్వ కట్టడమేనా ?

by Shyam |
ఉస్మానియా ఆస్పత్రి భవనం వారసత్వ కట్టడమేనా ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: నగరంలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో గంటల వ్యవధిలోనే వైద్య విద్య శాఖ డైరెక్టర్ ఆదేశం మేరకు ఆసుపత్రి అధికారులు ఖాళీ చేయించారు. దాన్ని కూల్చివేసి కొత్తదాన్ని నిర్మించే ఆలోచనను పలువురు అధికారులు, మంత్రులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అది వారసత్వ కట్టడమా కాదా తేల్చి చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భవనాన్ని కూల్చివేయాలనే వాదనలు, పురాతన కట్టడం కాబట్టి కూల్చివేయవద్దనే వాదనలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఆసుపత్రి మరమ్మత్తు అవసరాల కోసం గతంలోనే ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే ఆ డబ్బుతో జరిగిన మరమ్మత్తు పనుల వివరాలను అందజేయాలని న్యాయవాదికి సూచించింది. పనుల పురోగతి తెలుసుకుని వివరాలను అందజేస్తామని కోర్టుకు తెలియజేశారు. ఆ వివరాలు, ప్రభుత్వ వైఖరి వచ్చిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుందని పేర్కొన్న హైకోర్టు ఆగస్టు నాల్గవ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed