- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
'మర్డర్' సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్
దిశ ప్రతినిధి, నల్లగొండ:
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారి మారుతీరావు తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మారుతీరావు హైదరాబాదులో ఓ ప్రైవేటు లాడ్జిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో అమృత, ప్రణయ్‌ల ప్రేమ కావ్యాన్ని తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ కోర్టు మెట్లెక్కారు. గతంలో దీనిపై నల్లగొండ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా శుక్రవారం హైకోర్టు స్టేను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ప్రణయ్, అమృత, మారుతీ రావు పేర్లు, ఫొటోలు వాడకుండా సినిమా రిలీజ్ కి చేసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మూవీలో వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ కోర్టుకు తెలియజేసింది.