- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు: హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని ఆదేశిస్తూ, ఆధార్ కాలమ్ తొలగించేవరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని తెలిపిన హైకోర్టు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగ వచ్చని తేల్చి చెప్పింది.
న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని, ప్రజల సున్నితమైన సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన అన్న ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసి తమకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.