ప్రతి రోజూ కరోనా బులెటిన్ ఇవ్వాల్సిందే :హైకోర్టు

by Anukaran |   ( Updated:2021-02-25 03:04:31.0  )
Telangana High Court
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రతి రోజూ కరోనా బులెటిన్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు కాకుండా.. వారానికి ఒకసారి కరోనా బులెటిన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో గత రెండు రోజులుగా కరోనా హెల్త్ బులెటిన్ నిలిపివేశారు. కరోనా బులెటిన్ నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం రాష్ట్ర హైకోర్టు విచారించింది.

కరోనా పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు జరిగిన కరోనా పరీక్షలను వెల్లడించింది. ఆర్టీపీసీఆర్ 1,03,737, రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కాగా, ప్రతి రోజూ కరోనా బులెటిన్ ఇవ్వాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రంలో వీలైనంత త్వరంలో సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 50 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ తీసుకొనేలా ప్రచారం చేయాలని సూచించింది. రెండో దశ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు సూచించింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై తదుపరి విచారణ మార్చి 18కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed