- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ యథాతథం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికల నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడిచిందని.. తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా.. తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8న తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మార్చి 10న పోలింగ్ ఉండగా.. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అదే నెల14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.