- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించండి: హైకోర్టు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ తనను జైలుకు తరలించడంపై అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సానుకూలంగా స్పందించి తీర్పు వెల్లడించింది. విజయవాడ లేదా గుంటూరుల్లోని ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్న వాదనలు విన్న న్యాయస్థానం ఆయనను గుంటూరులోని రమేశ్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వ న్యాయవాది ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ నిర్ణయం తీసుకుంటారని వాదించగా, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను రమేష్ ఆస్పత్రికి తరలింపు ప్రక్రియ చేపట్టారు.
Advertisement
Next Story