ద్విచక్ర వాహనదారులకు అలర్ట్.. MV యాక్ట్‌లో కీలక మార్పులు

by Anukaran |   ( Updated:2021-10-25 23:03:42.0  )
Two-wheelers motorists
X

దిశ, డైనమిక్ బ్యూరో: మీకు బైకు ఉందా?.. సరదాగా అక్క కొడుకునో, అన్న కూతురునో అలా బయటకు తీసుకెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే. ఎంవీ యాక్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. నాలుగేళ్ల లోపు చిన్నారులను బైకుపై తీసుకెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు సూచించింది. వాహనదారుడి వెనుక చిన్నారులు కూర్చుంటే వారు పడిపోకుండా ఉండేందుకు బెల్టును ధరించాలని ఎంవీ యాక్ట్‌లో పొందుపరిచారు.

అయితే, ఈ బెల్టు తేలికగా ఉండి, 30 కిలోల బరువును సైతం తట్టుకునేలా ఉండి BIS గుర్తింపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతేగాకుండా.. వెనకాల కూర్చున్న చిన్నారులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. అయితే, ఇలా చిన్నారులు బైకుపై ఉన్నప్పుడు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌గా వెళ్లొద్దని గెజిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెలరోజుల్లో తెలియజేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది.

Advertisement

Next Story

Most Viewed