ఆపిల్‌.. చెర్రీ.. ఏ పండు కావాలి.. కోడ్ భాషలో వాట్సాప్ హైటెక్ వ్యభిచారం

by Anukaran |   ( Updated:2021-09-08 23:58:40.0  )
ఆపిల్‌.. చెర్రీ.. ఏ పండు కావాలి.. కోడ్ భాషలో వాట్సాప్ హైటెక్ వ్యభిచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. వాట్సాప్ వేదికగా ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. విదేశీ యువతులతో నగరంలో ఓ వ్యక్తి హైటెక్ వ్యభిచారాన్ని నడిపిస్తున్నాడు. దీని కోసం వాట్సాప్ ద్వారా కోడ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించడం విశేషం. ఆపిల్‌.. చెర్రీ.. జామ.. నారింజ.. ఇవి పండ్ల పేర్లు కాదు.

ప్రత్యేక కోడ్‌ భాష. ఆస్ట్రేలియా అమ్మాయిలైతే చెర్రీస్‌ ఉన్నాయి.. కావాలా..? అంటూ మెసేజ్‌ పెడుతున్నారు. మన దేశానికి చెందిన వాళ్లయితే యాపిల్స్‌ ఉన్నాయి.. ఎవరైనా తింటారా..? అని అడుగుతున్నారు. ఒక్కో దేశానికి చెందిన అమ్మాయిలకు ఒక్కో కోడ్‌ ఉంటుంది. ఇలా కోడ్ భాషతో ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్‌ వ్యభిచారం నగరంలో జోరుగా నడుస్తోంది.

ఇటీవల గచ్చిబౌలిలోని ఓ Five Star హోటల్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ రైడ్‌లో ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిగిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

థాయ్‌లాండ్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌ నుంచి యువతులను భారత్‌కు విజిట్‌ వీసాపై రప్పించి, గడువు ముగిసే వరకు హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు నగరాలకు తిప్పుతున్నారని తెలిసింది. ఆ తర్వాత కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతులు ఏ నగరానికి వెళ్లినా అక్కడున్న Five Star హెటల్స్‌లో 1-2 రోజులు మాత్రమే ఉంటారు.

అమ్మాయిలను ఎప్పుడు తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది. అయితే విటుల్లో వీఐపీలు, సంపన్న కుటుంబాలకు చెందిన వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే ఎక్కువగా ఉంటడం గమనార్హం. దీంతో వారి వద్ద భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విచారణలో నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ మేసేజ్‌లు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ హైటెక్ వ్యభిచార ముఠాకు కారణమైన ప్రధాన సూత్రధారుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed