క్వారంటైన్ స్పెషల్: వ్యవసాయం చేస్తున్న హీరోయిన్ కీర్తి…

by Shyam |
క్వారంటైన్ స్పెషల్: వ్యవసాయం చేస్తున్న హీరోయిన్ కీర్తి…
X

కరోనా ఎఫెక్ట్ తో దేశం లోక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో సినీ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు?. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తే… డ్యాన్సులు, టిక్ టాక్ లు, కుకింగ్ అంటూ ఎవరికి నచ్చిన స్టైల్ లో వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరందరికీ భిన్నంగా ఓ హీరోయిన్ వ్యవసాయం చేస్తోంది. అంత గొప్ప పనిచేసేది ఎవరూ అనేగా మీ సందేహం.

కోలీవుడ్ సీనియర్ హీరో అరుణ్ పాండ్యన్ కూతురు కీర్తి పాండ్యన్. తుంబా మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి… లాక్ డౌన్ సమయంలో తమ పొలంలోనే వ్యవసాయం చేస్తోంది. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న కీర్తి… సామాజిక దూరం పటిస్తున్నాని తెలిపింది. ఇది పబ్లిక్ ఏరియా కాదని… బాధ్యతగా వ్యవహరిస్తున్నామని ట్వీట్ చేసింది. క్వారంటైన్ పీరియడ్ లో మీరెందుకు వ్యవసాయం ట్రై చేయకూడదని సూచిస్తోంది.

అందరు హీరోయిన్లు ఇళ్లలో ఎంజాయ్ చేస్తుంటే కీర్తి వ్యవసాయ పనులు చేస్తుండడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా కీర్తి తన తండ్రితో కలిసి మలయాళీ హిట్ చిత్రం “హెలెన్” సినిమాలో నటించబోతోంది. గడ్డకట్టే పరిస్థితుల్లో ఒక యువతి గదిలో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది.

Tags : Keerthi pandian, Arun Pandian, Kollywood, lockdown, CoronaVirus Covid19
Slug :

Advertisement

Next Story