ఏంజెల్ ఆర్ణతో గోపీచంద్ రెండోసారి?

by Shyam |   ( Updated:2021-02-09 06:40:19.0  )
ఏంజెల్ ఆర్ణతో గోపీచంద్ రెండోసారి?
X

దిశ, సినిమా: మ్యాచో హీరో గోపీచంద్ – డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఇప్పటికే సినిమా ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ మార్చిలో ప్రారంభం కాబోతుండగా.. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. రిలీజ్ డేట్స్ రష్ ఉండటంతో అక్టోబర్ 1న సినిమా విడుదల కాబోతున్నట్లు కొంచెం వెరైటీగా ప్రకటించిన మూవీ యూనిట్.. చెప్పిన టైమ్‌కు ఖచ్చితంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రామిస్ చేశారు. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. హీరోయిన్ ఫైనల్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఏంజెల్ ఆర్ణగా గుర్తుండిపోయే పాత్రను చేసిన రాశినే నెక్స్ట్ మూవీకి కూడా రిపీట్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా రాశీ.. ఇప్పటికే గోపీచంద్‌ కాంబినేషన్‌లో ‘జిల్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story