స్వర్ణకారుడిగా ‘సంపూ’..

by Shyam |
స్వర్ణకారుడిగా ‘సంపూ’..
X

తొలి సినిమాతోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ.. తొలిచిత్రం హృదయ కాలేయంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కొబ్బరిమట్ట చిత్రం చేశారు. సెటైరికల్ హీరోగా తనకంటూ ఒక విలక్షణతను చాటుకున్నారు. హీరోగానే కాకుండా కమెడియన్‌గాను సినిమాల్లో నటిస్తున్నారు. ‘‘సంపూ మీ అభిమానానికి బానిస’’ అంటూ డైలాగ్ లు చెప్పడం కాదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకునేందుకూ ముందుకొస్తారు. తాజాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రముఖులందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. సంపూ కూడా తన స్వగ్రామం సిద్దిపేటకు వెళ్లారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోల మధ్య సాగుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో సంపూ పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తన కంసాలి వృత్తిని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఒక వీడియో ట్వీట్ చేశారు.

‘‘రాజు పేద తేడా లేదు..నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని..నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత కంసాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లోం మిగిలిన గజ్జెలతో కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించాను’’ అంటూ ట్వీట్ చేశారు.

Tags: sampoornesh babu, hero, coronavirus, covid 19 affect, lockdown, be the real man challenge

Advertisement

Next Story