- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నితిన్ ఇంట పెళ్లి సందడి

X
దిశ, వెబ్ డెస్క్ :
ఎప్పుడో జరగాల్సిన హిరో నితిన్, షాలినీల నిశ్చితార్థం కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తన ‘నిశ్చితార్థం జరిగింది’ అంటూ నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఓ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య షాలినీకి ఉంగరం తొడుగుతున్న పొటోను పోస్ట్ చేశాడు. నిశ్చితార్థం వేడుకలో సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ షాలిని కనపడింది. నితిన్ ఇంట పెళ్లి వేడుక సందడి నెలకొంది. ఈ వేడుకలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లో నితిన్, షాలినిల కుటుంబ పెద్దలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
కరోనా నేపథ్యంలో పెళ్లి వేడుకలను నిరాడంబరంగానే నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు నితిన్, షాలిని వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులను నితిన్ తన పెళ్లికి ఆహ్వానించారు.
Next Story