కొవిడ్ లక్షణాలు గుర్తించే రిస్ట్ బ్యాండ్ ఇదిగో !

by Shyam |   ( Updated:2021-08-27 02:47:42.0  )
కొవిడ్ లక్షణాలు గుర్తించే రిస్ట్ బ్యాండ్ ఇదిగో !
X

దిశ, ఫీచర్స్ : కరోనా వైరస్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా, థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటువ్యాధిని అరికట్టడానికి మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. కానీ రోజువారీ జీవితంలో ప్రోటోకాల్‌ను పాటించే వారు తక్కువవుతున్నారు. దీంతో సమస్యకు పరిష్కారంగా.. అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకినా, కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ చేసే పరికరాన్ని రూపొందించింది మధ్యప్రదేశ్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రేణు చోయిత్రాణి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రేణు కరోనా లక్షణాలను గుర్తించే రిస్ట్ బ్యాండ్‌ను తయారు చేయగా, దానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా పేటెంట్ మంజూరు చేసింది. ఈ బ్యాండ్ శరీర ఉష్ణోగ్రతను నిరంతరం గుర్తించగలదు. ఏదైనా సురక్షితం కానీ ఉపరితలం తాకినప్పుడు, ఆహారం లేదా ముఖాన్ని తాకే ముందు పరిశుభ్రత పాటించమని వినియోగదారుని హెచ్చరిస్తుంది.

‘కరోనా ఇన్‌ఫెక్షన్ ప్రారంభంలోనే గుర్తించినట్లయితే, సోకిన వ్యక్తికి వివిధ పద్ధతులను ఉపయోగించి చికిత్స చేయవచ్చు. కొవిడ్ ప్రారంభ లక్షణాలను స్కాన్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన విధానాలలో ఒకటైన సెన్సార్‌ల వినియోగిస్తున్నాం. ఇవి రసాయన సమ్మేళనాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ పరికరం వాటర్‌ప్రూఫ్ కాగా ఒకే చార్జ్‌లో ఏడు రోజుల వరకు ధరించవచ్చు. ట్రాకింగ్ దశలతో పాటు కేలరీలను కొలవడం వంటి అదనపు ఫీచర్లు కూడా బ్యాండ్‌లో ఉన్నాయి’ అని రేణు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed